ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓటమి బాట వీడలేకపోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసిన ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో.. ఎట్టకేలకి రాజస్థాన్ రాయల్స్ తాజా సీజన్‌లో గెలుపు బోణీ అందుకోగా.. కనీసం ఒక్క విజయం కూడా అందుకోని జట్టుగా బెంగళూరు టీమ్ పేలవంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైపోయింది. వాస్తవానికి నిన్న రాత్రి మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ తప్పిదాలు కూడా బెంగళూరు ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి..! #IPL2019
#RRvsRCB
#ViratKohli
#Rahane

0 Comments