---
టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీల అమలులో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును దేశ చరిత్రలోనే అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగుగా మంత్రివర్గం పేర్కొంది. టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతి తదితర అంశాల అడ్డుకట్టకు ఈ విధానం తోడ్పడుతుందని వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట, హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన, అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలని మంత్రివర్గం పేర్కొంది.
---
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.
-----*****-----
For latest news & updates : Subscribe :
--
Subscribe us @ :
Visit us @
Like us on
Follow us on
0 Comments